IGL షో వివాదం.. నటి రాఖీ సావంత్‌కు నోటీసులు

‘ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌’(IGL) కార్యక్రమంలో యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఇదే వ్యవహారంలో తాజాగా బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ (Rakhi Sawant)కు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయడానికి ఫిబ్రవరి 27వ తేదీన మహారాష్ట్ర సైబర్ సెల్ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

అందరికీ నోటీసులు

అయితే రణ్ వీర్ చేసిన వ్యాఖ్యలు వివాదమైన ఎపిసోడ్ లో రాఖీ సావంత్ (Rakhi Sawant) పాల్గొనలేదు. అయినా ఈ కేసుకు సంబంధించి ఈ షోలో గతంలో నిర్వహించిన ఎపిసోడ్ లలో అతిథులుగా హాజరైన వారికి కూడా నోటీసులు ఇస్తున్నట్లు ఐజీ యశస్వి యాదవ్ తెలిపారు. ఈ షోలోని అన్ని ఎపిసోడ్‌లలో పాల్గొన్న వారందరి పైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో నటులు, నిర్మాతలు సహా మొత్తం 42 మందికి సమన్లు ​జారీ చేసినట్లు పేర్కన్నారు.

ఇదీ జరిగింది..

ఐజీఎల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అతడి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కొందరు ఎంపీలు కూడా ఈ కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయ్‌ రైనా షోలో రణ్‌వీర్‌ ఈ వ్యాఖ్యలు చేయడంతో అతడిపైనా పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *