రాజకీయాలకు షార్ట్ బ్రేక్..! బుల్లితెరపై ‘రోజా’ రీ ఎంట్రీ

టాలీవుడ్ సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా (Roja Selvamani) మొన్నటిదాక రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ ఓటమిపాలయ్యాక రోజా కాస్త సైలెంట్ అయ్యారు. ఇక మంత్రిగా ఉన్న సమయంలో నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన రోజా ఇప్పుడు రాజకీయాలకు షార్ట్ గ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. 2024లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా రోజుల వరకు రోజా జాడ కనిపించలేదు.

సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్-4

ఇక తాజాగా చాలా రోజుల తర్వాత రోజా ముఖానికి మేకప్ వేసుకున్నారు. బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో వస్తున్న ‘సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 (zee telugu super serial championship 4)’ ద్వారా రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో రోజా తన డ్యాన్సుతో అలరించారు. ఆమెతో పాటు నటుడు శ్రీకాంత్, రాశి ఈ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్నట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మార్చి 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ షో టెలికాస్ట్ కానుంది.

బుల్లితెరపైకి రోజా రీఎంట్రీ

ఇక చాలా రోజుల తర్వాత రోజాను బుల్లితెరపై చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీవీలకు మళ్లీ కళ వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందరో సీనియర్ హీరోలతో నటించిన రోజా.. అవకాశాలు తగ్గిన తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మోడ్రన్ మహాలక్ష్మి, జబర్దస్త్ (Jabardasth) షోలతో ఆమె టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్ షోతో బాగా పాపులారిటీ సంపాదించారు. మరోవైపు సినిమాల్లోనూ అడపాదడపా పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *