
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. డార్లింగ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా థియేటర్ కు వెళ్లి ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కానీ ఇప్పట్లో ప్రభాస్ సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఓ తీపికబురు అందించింది హోంబలే ఫిల్మ్స్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఈ బ్యానర్ లో ‘సలార్- సీజ్ ఫైర్ (Salaar)’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు వేయి కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
𝐃𝐄𝐕𝐀 Returning To His DEN “ 𝐊𝐇𝐀𝐍𝐒𝐀𝐀𝐑 ”#SalaarCeaseFire Strikes Back To Dominate The BIG Screen ! 💥#Salaar RE – RELEASING On 𝐌𝐚𝐫𝐜𝐡 𝟐𝟏𝐬𝐭 ! pic.twitter.com/yesUj94xZL
— Seshu (@SeshLovely228) February 24, 2025
సలార్-1 రీ రిలీజ్
ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఈ వార్త భలే కిక్ ఇవ్వనుంది. ఇక సలార్-2 కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ప్రస్తుతం సలార్ పార్ట్-1తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అయితే ఆల్రెడీ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ (Salaar Part0-1 Re Release) చేయడం ఎందుకని కొందరు అంటుంటే.. ఈ మాసివ్ యాక్షన్ డ్రామాను మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడాలని ఇంకొందరు నెటిజన్లు అంటున్నారు. తప్పకుండా మరోసారి థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తామని చెబుతున్నారు.
మార్చిలో రీ-రిలీజ్ పండుగ
ప్రభాస్ హీరోగా శ్రుతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన సలార్- పార్ట్-1 మార్చి 21వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. సమ్మర్ సినిమాలకు ముందు ఈ సినిమాను మరోసారి థియేటర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రంతో పాటు మార్చిలో మహేష్ బాబు (Mahesh Babu), వెంకటేష్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, కార్తీ ‘యుగానికి ఒక్కడు’, నాని, విజయ్ దేవరకొండ నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలు కూడా రీ రిలీజ్ కానున్నాయి.