
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar), త్రిష కాంబోలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’ (Vidaamuyarchi). మాగిజ్ తిరుమనేని తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ తెలుగులో ‘పట్టుదల’ (Pattudala Movie) పేరుతో ఈ నెల 6వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది.
ఓటీటీలోకి వచ్చేది అప్పుడే
పట్టుదల చిత్రం విడుదలై నెల కూడా తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో మార్చి 3వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది (Vidaamuyarchi OTT Release Date). ఈ సినిమాలో అర్జున్, రెజీనా కీలక పాత్రల్లో సందడి చేశారు.
అమెరికన్ మూవీ ఆధారంగా
ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్ రూపొందించింది. 1997 అమెరికన్ చిత్రం బ్రేక్ డౌన్ ఆధారంగా విడాముయర్చిని తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ అంతా అజర్ బైజాన్‌లో జరిగిన విషయం తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇక అజిత్ ప్రస్తుతం తనకు ఎంతో ఇష్టమైన కారు రేసింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…