మంచు లక్ష్మి (Laxmi Manchu).. మోహన్ బాబు కుమార్తెగా టాలీవుడ్ కు పరిచయమైంది. మొదట లక్ష్మీ టాక్ షో అంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్, విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్స్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరించింది. నటిగా, యాంకర్ గా , నిర్మాతగా తన సత్తా చాటింది. అయితే లక్ష్మి ఎన్ని ప్రయోగాలు చేసినా పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ నిత్యం వార్తల్లో నిలుస్తూ పాపులారిటీ మాత్రం సంపాదించుకుంది.
అయితే ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండే మంచు లక్ష్మి పర్సనల్ లైఫ్ కు సంబంధించి కొన్ని పుకార్లు చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్నాయి. తన భర్త భర్త ఆండ్రు శ్రీనివాస్ (Manchu Laxmi Husband)కు లక్ష్మి విడాకులు ఇచ్చింది.. దీని వెనక తండ్రి మోహన్ బాబు హస్తం ఉందనే ఆరోపణలు చాలా ఏళ్ల నుంచి వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో విషయాలపై చాలా యాక్టివ్ గా సోషల్ మీడియా వేదికగా స్పందించే లక్ష్మీ ఈ విషయంపై మాత్రం ఎప్పుడూ నోరు విప్పలేదు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మీ తన భర్తతో తన రిలేషన్ గురించి మాట్లాడింది. తన భర్త ఆండీ విదేశాల్లో ఐటీ ప్రొఫెషనల్ గా పని చేస్తున్నారని, తమ మ్యారిడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. ‘మా ఇద్దరివి సపరేట్ జీవితాలు. మాకు నచ్చినట్లుగా మేం బతుకుతున్నాం. అంతే కానీ విడిపోలేదు. అందరూ ఏం అనుకుంటారో అని ఆలోచించాల్సిన అవసరం లేదు మాకు. ఓ కుటుంబంగా మేం చాలా హ్యాపీగా ఉన్నాం. నా కూతురు విద్యా నిర్వాణ ఇప్పుడు తన తండ్రి వద్ద ఉంది.’ అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






