Chhaava : తెలుగులో ‘ఛావా’ రిలీజ్.. ఎప్పుడంటే?

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో రష్మిక మందన్న ఫీ మేల్ లీడ్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఛావా (Chhaava). ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ (Lakshman Utekar) తెరకెక్కించిన ఈ సినిమాను మ్యాడ్ డాక్ ఫిల్మ్స్‌ పతాకంపై దినేశ్‌ విజన్ నిర్మించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ (Chatrapathi Shivaji Maharaj) పెద్ద‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌(Shambaji MAharaaj) జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

రూ.400 కోట్ల క్లబ్ లోకి ఛావా

ఛావా (Chhaava Collections) సినిమా ఇప్పటి వరకు రూ.370 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టినట్లు మేకర్స్ తెలిపారు. త్వరలోనే రూ.400 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమా హిందీలోనే విడుదలైంది. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ చూసి ఈ సినిమాను ఎలాగైనా చూడాలని మిగతా భాషల వారు, ముఖ్యంగా తెలుగు వారు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు భాషలో విడుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి.

మార్చి 7న ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్

ఈ క్రమంలో మేకర్స్ స్పందించారు. ఛావా తెలుగు వెర్షన్ (Chhaava Telugu Version Release) ను రిలీజ్ చేస్తే మరింత మార్కెట్ పెరుగుతుందని భావించారు. ఈ నేపథ్యంలోనే తెలుగులో రిలీజ్ చేయాలని భావించారు. తెలుగు బ్యాన‌ర్ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను మార్చి 7వ తేదీన తెలుగులో విడుద‌ల చేయడానికి రెడీ అయింది.  ప్ర‌స్తుతం ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌కు డ‌బ్బింగ్ జరుగుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ కు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ సినిమాలో విక్కీ కౌశ‌ల్ పాత్ర‌కు టాలీవుడ్ స్టార్ హీరోతో డబ్బింగ్ చెప్పిస్తున్నట్లు తెలిసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *