క్రిప్టో కరెన్సీ స్కామ్.. పోలీసుల విచారణకు కాజల్, తమన్నా!

టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా (Tamannaah), కాజల్ (Kajal Agarwal) ఓ వివాదంలో చిక్కుకున్నారు. పుదుచ్చేరిలో క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో ఈ ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేసి విచారించగా.. దాదాపు రూ. 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు ఇప్పడు తమన్నా, కాజల్ అగర్వాల్ మెడకు చుట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఇద్దరు హీరోయిన్లను పోలీసులు విచారించనున్నారు.

క్రిప్టో కరెన్సీ స్కామ్

క్రిప్టో కరెన్సీ (Crypto Currency Scam) ద్వారా అధిక లాభాలు ఇస్తానని కొందరు 3.50 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని పుదుచ్చేరి చెందిక ఆశోకన్ అనే ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పుదుచ్చేరి పోలీసులు నీతీష్ జైన్, అరవింద్ కూమార్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణలో పుదుచ్చేరి లో మాత్రమే కాకుండా చెన్నై, కోయంబత్తూరు, ఏపీలోను ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

తమన్నా, కాజల్ పై కేసు

మరోవైపు క్రిప్టోకరెన్సీ కి సంబంధించి 2022లో కోయంబత్తూరు జరిగిన లాంఛింగ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ తమన్నా,కాజల్‌ అగర్వాల్ పాల్గొన్నారు. వారు దీనికి ప్రమోటర్లుగా ఉండటం వల్ల ఈ మోసంలో వాళ్లకు కూడా భాగస్వామ్యం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని విచారించాలని నిర్ణయించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్నందుకు వారికి డబ్బులు ఎలా ఇచ్చారు అనే వివరాలను సేకరించనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *