Tillu Cube : ‘టిల్లు క్యూబ్’ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరంటే?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) వరుస హిట్లతో జోరుమీద ఉన్నాడు. ఇటీవలే ‘టిల్లు స్క్వేర్ (Tillu Square)’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం టిల్లు క్యూబ్, తెలుసు కదా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సిద్ధు ప్రధాన పాత్రలో నటించిన టిల్లు ఫ్రాంఛైజీలో ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు డీజే టిల్లు (DJ Tillu), టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. ఇక తాజాగా ఇదే ఫ్రాంఛైజీలో మూడో సినిమా టిల్లు క్యూబ్ తెరకెక్కనుంది.

టిల్లు క్యూబ్ డైరెక్టర్ ఎవరు

అయితే తాజాగా టిల్లు క్యూబ్ (Tillu Cube) డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది. డీజే టిల్లు సినిమాను విమల్ తెరకెక్కించగా సిద్ధు సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక టిల్లు స్క్వేర్ మూవీని మల్లిక్ రామ్ తెరకెక్కించగా సిద్ధూకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించి ఆకట్టుకుంది. టిల్లు స్క్వేర్ మూవీ ఏకంగా రూ.125 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక ఇప్పుడు టిల్లు క్యూబ్ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారో ప్రకటించారు ప్రముఖ నిర్మాత నాగవంశీ (Naga Vamsi).

నాగవంశీ మ్యాడ్ అప్డేట్

మ్యాడ్ స్క్వేర్ (MAD Square) సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాగవంశీ టిల్లు క్యూబ్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఇప్పటికే మ్యాడ్ సినిమాతో కళ్యాణ్ సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తో మరోసారి నవ్వులు పంచేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ డైరెక్టర్, సిద్ధు కలిస్తే టిల్లు క్యూబ్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *