
టాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఓవైపు దర్శకత్వంతో మరోవైపు నటుడిగా బిజీగా గడుపుతున్నాడు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu)’. విక్రాంత్, చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన జాక్ రెడ్డి అనే పాత్రలో కనిపించనున్నారు.
Vemana telsa ma caste ye..! 😉
Meet Jack Reddy, played by #TharunBhascker, from the world of #SanthanaPrapthirasthu 😎
He doesn’t just solve problems… He buries them. Literally.💀⚰️ pic.twitter.com/5Xi5uRbvpn
— BA Raju’s Team (@baraju_SuperHit) March 1, 2025
జాక్ రెడ్డిగా తరుణ్ భాస్కర్
ఈ సందర్భంగా మేకర్స్ తరుణ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తరుణ్ చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఆయన చుట్టూ అంత్యక్రియలకు సంబంధించిన సింబల్స్ ఉన్నాయి. ఇక కింద ‘జాక్ రెడ్డి ఫ్యునరల్ సర్వీస్ (Jack Reddy Funeral Service)’ అని కనిపించిన ఓ వ్యాన్ ఈ మూవీలో తరుణ్ భాస్కర్ పాత్రపై క్యూరియాసిటీ పెంచుతోంది. ముఖ్యంగా జాక్ రెడ్డి పాత్రను పరిచయం చేస్తూ వేమన తెల్సుగా మా క్యాస్టే అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది.
వేమన మన క్యాస్టే
ఇక ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ (Vennela Kishore), అభినవ్ గోమటం, జీవన్ కుమార్, మురళిధర్ గౌడ్, శ్రీలక్ష్మి, హర్ష వర్ధన్, బిందు చంద్రమౌళి, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీలా, సద్దాం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ నుంచి వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, జీవన్ కుమార్ క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చేశారు. కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసిన ఈ స్టోరీలో దంపతులు ఎదుర్కొనే పలు సమస్యలను ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు సమాచారం.