ఆస్పత్రి నుంచి వీడియో రిలీజ్ చేసిన సింగర్ కల్పన

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన (Singer Kalpana) ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లానని తాజాగా కల్పన తెలిపారు. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఆస్పత్రి నుంచి ఓ వీడియో విడుదల చేశారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్లు స్పష్టం చేశారు.

అదంతా తప్పుడు ప్రచారం

‘‘మా ఫ్యామిలీపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దానిపై నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను, నా భర్త, కుమార్తెతో చాలా హ్యాపీగా ఉన్నాం. 45 ఏళ్ల వయసులోనూ నేను పీహెచ్డీ, ఎల్ఎల్బీ చేస్తున్నానంటే.. ఇదంతా నా భర్త సహకారం ఉండటం వల్లే. ఆయనతో నేను హ్యాపీగా ఉన్నాను. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి వల్ల కొంతకాలంగా నాకు నిద్ర పట్టడం లేదు. అందుకోసం నేను చికిత్స తీసుకుంటున్నాను.

త్వరలోనే మీ ముందుకు

వైద్యుల సూచన మేరకే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. కానీ ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల మాత్రలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఓవర్ డోస్ అయింది. అందువల్లే స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సరైన సమయంలో కాల్ చేయడం, కాలనీవాసులు, పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల నేను ఇవాళ బతికి ఉన్నాను. త్వరలో మిమ్మల్ని అలరించేందుకు నా పాటలతో మీ ముందుకు వస్తాను.” అంటూ కల్పన వీడియోలో మాట్లాడారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *