
టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన (Singer Kalpana) ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లానని తాజాగా కల్పన తెలిపారు. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఆస్పత్రి నుంచి ఓ వీడియో విడుదల చేశారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్లు స్పష్టం చేశారు.
అదంతా తప్పుడు ప్రచారం
‘‘మా ఫ్యామిలీపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దానిపై నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను, నా భర్త, కుమార్తెతో చాలా హ్యాపీగా ఉన్నాం. 45 ఏళ్ల వయసులోనూ నేను పీహెచ్డీ, ఎల్ఎల్బీ చేస్తున్నానంటే.. ఇదంతా నా భర్త సహకారం ఉండటం వల్లే. ఆయనతో నేను హ్యాపీగా ఉన్నాను. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి వల్ల కొంతకాలంగా నాకు నిద్ర పట్టడం లేదు. అందుకోసం నేను చికిత్స తీసుకుంటున్నాను.
Singer #Kalpana‘s Shocking Video
I took sleeping pills due to stress. The reason I am alive today is my husband and daughter.
There are no differences between me and my husband.#KalpanaRaghavendar #singerkalpana pic.twitter.com/Dla7KimCPS
— CineJosh (@cinejosh) March 7, 2025
త్వరలోనే మీ ముందుకు
వైద్యుల సూచన మేరకే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. కానీ ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల మాత్రలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఓవర్ డోస్ అయింది. అందువల్లే స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సరైన సమయంలో కాల్ చేయడం, కాలనీవాసులు, పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల నేను ఇవాళ బతికి ఉన్నాను. త్వరలో మిమ్మల్ని అలరించేందుకు నా పాటలతో మీ ముందుకు వస్తాను.” అంటూ కల్పన వీడియోలో మాట్లాడారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.