
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ఓవైపు నటిగా, నిర్మాతగా జోడు గుర్రాల ప్రయాణాన్ని జోరుగా సాగిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. మరోవైపు సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తోంది. ఇలా బిజీబిజీగా తన ప్రొఫెషనల్ లైఫ్ ను గడుపుతోంది. తాజాగా నిహారిక తన విడాకుల గురించి స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె విడాకుల విషయంపై మాట్లాడింది.
విడాకులపై మెగా డాటర్
నిహారిక కొణిదెల, టెకీ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం జరిగిన మూడేళ్లకే ఈ జంట విడాకుల బాట పట్టింది. మనస్పర్థలు, విభేదాలతో విడిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక విడాకుల విషయంపై స్పందించింది. సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా, విడాకులు ఏ స్త్రీకైనా బాధాకరమైన అనుభవం అని ఆమె పేర్కొంది.
కమిటీ కుర్రోళ్లు సూపర్ హిట్
విడాకుల గురించి ఆలోచిస్తూ ఎవరూ పెళ్లి బంధంలోకి ప్రవేశించరని.. కొన్నిసార్లు పరిణామాలు వేరుగా ఉంటాయని తెలిపింది. అనుకున్నట్లుగా జీవితం ఉండదని, కొన్నిసార్లు కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పింది. లైఫ్ లో ఎదుర్కొనే సవాళ్లు మనకు చాలా నేర్పిస్తాయని నిహారిక తెలిపింది. ప్రస్తుతం ఈ బాధ నుంచి బయటపడి తన కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలిపింది. నిహారిక నిర్మించిన `కమిటీ కుర్రోళ్ళు` సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే తమిళ చిత్రం `మద్రాస్కారన్` తో సందడి చేసింది.