వీకెండ్ మస్తీ.. ‘తండేల్’ టు ‘లైలా’ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలివే

వీకెండ్ వచ్చేసింది. కుటుంబమంతా కలిసి జాలీగా గడిపాలనుకుంటున్నారా..? స్నేహితులతో కలిసి ఏదైనా సినిమా చూడాలనుకుంటున్నారా..? బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాలీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అయ్యాయి. ఈ వారంతంలో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చేశాయి. మరి ఏ చిత్రాలు ఏ ఓటీటీలో సందడి చేస్తున్నాయో చూద్దామా..?

తండేల్ : నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్. చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం వేచి చూస్తున్న చైతూకు తండేల్ సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైన ఈ సూపర్ హిట్ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వేదికగా మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.

లైలా : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన మూవీ లైలా. విశ్వక్ సేను లేడీ గెటప్ లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అందుకే విడుదలై నెల రోజులు కూడా తిరక్కుండానే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆహాలో మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలివే
  1. ధూం ధాం – ఈటీవీ విన్
  2. పట్టుదల – నెట్​ఫ్లిక్స్
  3. బాపు (తెలుగు) మార్చి 07- జియో హాట్​స్టార్
  4. రివైండ్ – మార్చి 07- లయన్స్ గేట్ ప్లే
  5. రేఖా చిత్రం (తెలుగు) మార్చి 07- సోనీలివ్‌
  6. నదానియాన్‌ (హిందీ) మార్చి 07- నెట్​ఫ్లిక్స్
  7. కుడుంబస్థాన్- మార్చి 07 – జీ 5

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *