
ఇక నుంచి మల్టీప్లెక్స్ లు సహా రాష్ట్రంలో అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఒకే టికెట్ ధర(Movie Ticket Price)ను నిర్ణయిస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు మూవీ టికెట్ రేట్లను రూ.200 నిర్ణయించింది. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో ఆయన సినీ రంగానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను సభ ముందుకు తీసుకువచ్చారు.
కర్ణాటక బడ్జెట్
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల (Karnataka Assembly Sessions 2025) సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం రోజున అసెంబ్లీలో 2025-26కు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మౌలిక వసతులు, మతపరమైన కేటాయింపులు, సినిమా ప్రమోషన్స్, మహిళా సాధికారికత వంటి అంశాల కోసం మొత్తం రూ.4,08,647 కోట్ల పద్దును ఆయన సభ ముందుకు తీసుకువచ్చారు.
కన్నడ సర్కార్ ఓటీటీ
ఇక కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ (Kannada OTT) ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్‌లో ఒక ఫిల్మ్‌సిటీ (Mysore Film City) నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకోసం 150 ఎకరాల భూమిని… దీని నిర్మాణానికి రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.