
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. మార్చి 13వ తేదీ వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లపై పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16, ఐఫోన్ 13, ఐఫోన్16ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 వంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా.. ఐఫోన్ 16పై రూ.20వేల ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. యాపిల్ కంపెనీ ఐఫోన్ 16ని రూ.79,900తో మార్కెట్లోకి తీసుకురాగా.. ఫ్లిప్ కార్ట్ దీనిపై రూ.10,901 ఫ్లాట్ డిస్కౌంటుతో ఈ మొబైల్ ను రూ.68,999 వద్ద విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ ద్వారా రూ.4వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ (Exchange Bonus) కింద రూ.5,000 రాయితీతో ఐఫోన్ 16 ని రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు.
ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఐఫోన్ ధరలు
- ఐఫోన్ 16 – రూ.68,999
- ఐఫోన్ 16 ప్లస్ – రూ.69,999
- ఐఫోన్ 16 ప్రో – రూ.1,03,900
- ఐఫోన్ 16 ఈ – రూ.55,900
- ఐఫోన్ 15 – రూ.58,999
- ఐఫోన్ 13 – రూ.40,999
ఇక శాంసంగ్ మొబైల్స్ పైనా ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించింది. మరోవైపు తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చిన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌పై కూడా రాయితీ ప్రకటించింది. క నథింగ్ ఫోన్ల పైనా డిస్కౌంట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.
శాంసంగ్ ఫోన్లపై డిస్కౌంట్లు
- శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్ – రూ.52,999
- శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ – రూ.54,999
- శాంసంగ్ గెలాక్సీ ఎస్25 – రూ.73,999
- శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 – రూ.1,49,999.
నథింగ్ మొబైల్స్ పై డిస్కౌంట్
- నథింగ్ 2ఏ రూ.19,999
- నథింగ్ 2ఏ ప్లస్ – రూ.25,499
మోటోరొలా ఫోన్ల ధరలు
- మోటోరొలా ఎడ్జ్ 50 – రూ.20,999
- మోటోరొలా జీ85 – రూ.15,999
- పోకో ఎక్స్6 ప్రో – రూ.19,999కే లభిస్తుంది.