అయ్యో మళ్లీనా..? సునీతా విలియమ్స్‌ రాక మరింత ఆలస్యం

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams) ఇప్పట్లో భూమ్మీదకు వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిన ఆమె దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు వెళ్లిన బచ్‌ విల్మోర్ (Butch Wilmore) కూడా అక్కడే చిక్కుకున్నారు.

క్రూ 10 మిషన్ వాయిదా

అయితే వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా (NASA)-స్పేస్ ఎక్స్ (Space X)లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడటంతో సునీత రాక మరింత ఆలస్యం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్‌ 9 రాకెట్‌ బయలు దేరేందుకు రెడీ అయిన క్రూ 10 మిషన్ లోని హైడ్రాలిక్‌ సిస్టమ్‌లో సమస్య రావడంతో ఈ ప్రయోగాన్ని నిలిపివేశారు. ఈ సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేస్తామని నాసా వెల్లడించింది.

వ్యోమగాములు లేకుండానే

గతేడాది జూన్‌ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో ఈ ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌ (ISS)కు చేరుకున్నారు. అయితే వారు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమ్మీదకు వచ్చేసింది. ఇక అప్పటి నుంచి సునీతా, విల్మోర్‌ స్పేస్ లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా (NASA) స్పేస్‌ఎక్స్‌తో కలిసి పని చేస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *