
దేశవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా బంగారం (Gold Price Today), వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి ధరలు రూ.90వేలకు చేరువయ్యాయి. ఇక కిలో వెండి ధర లక్ష రూపాయలు దాటింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారం చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీంతో బంగారానికి భారీ డిమాండ్ పెరిగింది.
నేటి పసిడి ధరలు ఇలా
దీంతో పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం బంగారాన్ని అధికంగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో పుత్తడి రేట్లు మరింతగా పెరుగుతున్నాయి. సామాన్యులు గోల్డ్ (Gold Rates Today) కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. శుభకార్యాలకు పసిడి, వెండి కొనాలంటే మధ్యతరగతి ప్రజలు ముందడుగు వేయలేకుండా ఉంది. మరి ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
లక్షకు చేరిన వెండి ధర
బుధవారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.88,870 వద్ద విక్రయించారు. అయితే గురువారం నాటికి రూ.680 పెరిగి ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రూ.89,550 వద్ద అమ్ముడుపోతోంది. ఇక కిలో వెండి ధర (Silver Price Today) బుధవారం రోజున రూ.1,00,549 ఉంది. ఇవాళ్టికి రూ.750 పెరిగి అది రూ.1,01,299కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి.
బంగారం, వెండి ధరలు ఇలా
- హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.89,550.. కిలో వెండి ధర రూ.1,01,299
- విజయవాడలో బంగారం రూ.89,550గా ఉంది.. వెండి రూ.1,01,299గా ఉంది.
- విశాఖపట్నంలో బంగారం రూ.89,550.. వెండి రూ.1,01,299
- ప్రొద్దుటూరులో బంగారం రూ.89,550.. వెండి రూ.1,01,299