
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నారు. ఈ కేసులో ఆమెను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులకు ఆమె కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..
యూట్యూబ్ లో చూశా
“నేను బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి. నేనెప్పుడూ ఇలాంటి పనులు చేయలేదు. దుబాయ్ నుంచి ఇంతకు ముందెన్నడూ గోల్డ్ ను అక్రమంగా తీసుకు రాలేదు. ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలో యూట్యూబ్ (YouTube)లో చూసి నేర్చుకున్నాను.” అని రన్యారావు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఇందులో పోలీసు విభాగానికి చెందిన కొందరు, కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలిసినట్లు సమాచారం.