తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) రెండో రోజే హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ చర్చతో సభ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో BRS MLA, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ కూడా మనస్ఫూర్తిగా స్పీచ్ చదివి ఉండరు. 15నెలల పాలననీ కేవలం 36 నిమిషాల్లో చదివేశారు. రైతులకు రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకాన్ని(Mahalaxmi Scheme) అమలు చేశారా? రైతు కూలీలకు రూ.12 వేలు రూపాయలు ఇచ్చారా? అధికారం కోసం లక్షల అబద్ధాలు చెప్పారని ఫైరయ్యారు.
అసెంబ్లీలో ఏతుల వెంకటయ్య కథ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి#JagadeeshRedddy #BRS #BRSParty #TelanganaAssembly pic.twitter.com/LLyZa3WPyv
— Aadya TV (@AadyaTv_) March 13, 2025
బీఆర్‌ఎస్‌కు కోమటిరెడ్డి కౌంటర్
ఇక, జగదీష్ రెడ్డికి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మా ప్రభుత్వం రూ.21 వేల కోట్ల రుణమాఫీ, పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వంటివి ఆయనకు కనిపించడం లేదన్నారు. అలాగే, జగదీష్ రెడ్డి కామెంట్స్ కు మంత్రి కోమటి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దళితుడిని CM చేస్తామని BRS చేసిందా? మూడెకరాల భూమి ఇస్తామని ఇచ్చిందా? BRS చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్నారు. ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం. మీరు పదేళ్లలో చేయలేనిది.. తాము 14 నెలల్లో చేశామన్నారు.
@KTRBRS has utterly failed as opposition. While Congress remains open to constructive and meaningful suggestions from BRS, they seem entirely disinterested—their entire focus instead is on strengthening their Big Boss Modi’s BJP in #Telangana.#Assembly https://t.co/7qPnp7usow
— WithKotaNeelima (@WithKotaNeelima) March 13, 2025
స్పీకర్ వర్సెస్ జగదీశ్ రెడ్డి
అయితే, ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగం పైనే మాట్లాడండని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సభ్యులు డివేయేషన్ అయితే, అటు నుంచి కూడా కౌంటర్ వస్తుంది. అధికార పక్షం మాట్లాడకుండా ఉండాలి అంటే. మీరు డివియేషన్ కావొద్దని సూచించారు. ఇక, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసహనానికి గురికాకండి అని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు.
‘ఇది మంచిది కాదు. సభను తప్పుదోవ పట్టించడం సరికాదు అన్నారు. నన్ను ప్రశ్నించడమే తప్పు. నేను ఏం తప్పుదోవ పట్టించానో చెప్పండని జగదీష్ రెడ్డి అడిగారు. ఈ సభలో సభ్యులందరికి పెద్దగా స్పీకర్ అక్కడ కూర్చొన్నారు తప్ప ఈ సభ స్పీకర్‌దన్నారు. నేనేం తప్పు మాట్లాడలేదు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని’ జగదీష్ రెడ్డి తెలిపారు. BRS ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్పీకర్‌కి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ MLAలు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.






