
ఈ ఏడాది తెలంగాణ ఇంటర్ పరీక్షలు(TG Inter Exams 2025) విద్యార్థులకు సంకటంగా మారాయి. అందుకు కారణం క్వశ్చన్ పేపర్లో తప్పు ప్రశ్నలు(Wrong Questions) రావడమే. ఈనెల 10న నిర్వహించిన ఇంగ్లిష్ పేపర్-2లో ఓ ప్రశ్న తప్పుగా ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సెకండియర్ ఇంగ్లిష్ పేపర్ అస్పష్టంగా ముద్రించడంతో ఏడో ప్రశ్నకు 4 మార్కులు ఇస్తామని బోర్డు ప్రకటించింది.
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
ఆ తర్వాత 11వ తేదీన జరిగిన ఫస్టీయర్ పేపర్లో 3 సబ్జెక్టుల్లో కలిపి ఏకంగా ఆరు ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఇదిలా ఉండగా నిన్న సెకండియర్ బోటనీలో 2, గణితంలో ఒక తప్పు ప్రశ్నలు వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు (TGBIE)పై స్టూడెంట్స్, వారి పేరెంట్స్ మండిపడుతున్నారు.
ఈ నెల 25 వరకూ పరీక్షలు
కాగా 2025 మార్చి 6 నుంచి ప్రారంభమైన TS ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలలో 9.96 లక్షల మంది విద్యార్థులు మొత్తం 1,532 పరీక్ష కేంద్రాలలో పాల్గొన్నారు. రెండవ సంవత్సరం ఇంగ్లిష్ II పేపర్ 2025 మార్చి 10 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగింది. 4,46,992 మంది రిజిస్టర్డ్ అభ్యర్థుల్లో 4,33,963 మంది పరీక్షలో పాల్గొన్నారు, కాగా 13,029 మంది గైర్హాజరయ్యారు. కాగా ఈనెల 25 వరకు TS ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు కొనసాగుతాయి.