భలే ఛాన్సులే.. ‘డ్రాగన్’ హీరో చేతిలో 2 తెలుగు సినిమాలు

తమిళ సినిమాలకే కాదు కోలీవుడ్ హీరోలకూ తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అందుకే తమిళ నటులు తమ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. అలా ఇప్పటికే కోలీవుడ్ స్టార్లు అజిత్ (Ajith Kumar), విజయ్, సూర్య, ధనుష్, శివకార్తికేయన్, విశాల్, కార్తీ (Karthi) వంటి హీరోలు తెలుగులో తమ సినిమాలు డబ్ చేసి విడుదల చేసి సూపర్ మార్కెట్ తో పాటు మంచి పాపులారిటీ, ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. కొంతకాలం తర్వాత వీళ్లు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడం ప్రారంభించారు.  ఇప్పుడు ఈ జాబితాలో ఓ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ కూడా చేరాడు.

Image

తెలుగులోకి మరో కోలీవుడ్ హీరో

‘లవ్ టుడే (Love Today)’ సినిమాతో తమిళ ప్రేక్షకులనే కాదు తెలుగులోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ప్రదీప్ రంగనాథన్. ఈ సినిమా టాలీవుడ్ లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon)’ అంటూ మరో చిత్రంతో వచ్చి ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేశాడు ప్రదీప్. ఈ సినిమా చిన్న చిత్రంగా విడుదలై రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అందుకే ప్రదీప్ రంగనాథన్ కు తెలుగులోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయి. అలా ఈ యంగ్ హీరో(Pradeep Ranganathan) ఇప్పుడు రెండు స్ట్రెయిట్ సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నారు. ఈ రెండు కూడా భారీ సినిమాలు తీసే ప్రముఖ నిర్మాణ సంస్థలతోనే కావడం గమనార్హం.

Image

మైత్రీతో ప్రదీప్ సినిమా

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ పై తెలుగు నిర్మాతల కన్ను పడింది. అందుకే ఈ యంగ్ హీరోకు వరుస అవకాశాలు ఇస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. అలా తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)తో ప్రదీప్ రంగనాథన్ ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్ కుమార్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా చేస్తున్న నిర్మాతలు.. ప్రదీప్ తో ఓ చిత్రం చేసేందుకు రెడీ అయినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రదీప్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లుగా టాక్. ఈ మూవీలో ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు (mamitha baiju) హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం.

Image

సితారతోనూ ఓ ప్రాజెక్టు

ఇక ప్రదీప్ రంగనాథన్ తో సినిమా చేసేందుకు మరో తెలుగు ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) కూడా ముందుకు వచ్చినట్లు తెలిసింది. ‘మ్యాడ్ -2 (MAD 2)’ ఫేం కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ హీరో కోసం ఓ మంచి ఎంటర్టైన్మెంట్ స్టోరీని ప్లాన్ చేయాలని నిర్మాతలు కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) కు సూచింటినట్లు సినీ వర్గాల్లో టాక్. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మైత్రీ, సితార నిర్మాతల్లో ఎవరు ప్రదీప్ ని ముందుగా తెలుగులో పరిచయం చేస్తారో చూడాలి.

Related Posts

Pawan kalyan: ఇష్టమైన హీరోయిన్ గురించి మొదటిసారిగా స్పందించిన పవన్ కళ్యాణ్..

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనిది. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తాజా సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) కొంత గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ, ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలిగించింది.…

ఆ సినిమా నేనే చేసుంటే బాగుండేది.. ఎన్టీఆర్‌ సినిమాపై హృతిక్ కామెంట్ వైరల్..

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ లు గుర్తుకొస్తారు. వారు చేసిన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *