
‘స్టీవ్.. చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో.. మనం కూడా మన గుడారానికి సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగితేలాల్సిందే’.. ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలో.. అబ్బ కమల్ హాసన్’… ఈ డైలాగ్స్ వింటే మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమైపోయి ఉంటుంది కదా. అదేనండి.. ‘ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)’ మూవీ గురించి. 2018లో తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఈ నగరానికి ఏమైంది సీక్వెల్
ఈ సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కామియో రోల్ చేశాడు. సోషల్ మీడియాలో మీమ్స్ వల్ల యూత్‌కు ఈ సినిమా బాగా ఎక్కేసింది. ఇటీవల రీ రీలిజ్‌కు విపరీతమైన క్రేజ్ దక్కింది. చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్ ఉందంటూ తరుణ్ భాస్కర్ గతంలో చెప్పారు. దీంతో ఈ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది బాకీలు తీర్చాలి
తాజాగా ఈ సినిమాపై తరుణ్ భాస్కర్ (Tharun Bhascker Dhaassyam) ఓ అప్డేట్ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఓ సాలిడ్ అప్డేట్ షేర్ చేశారు. ‘ఈ’ అనే అక్షరాన్ని హైలైట్ చేస్తూ ‘ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలి’ అని స్టోరీలో పెట్టారు. దీంతో ఆయన ‘ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi 2 update)’ సినిమా సీక్వెల్ గురించే మాట్లాడారంటూ నెటిజన్లు సంబుర పడుతున్నారు. సీక్వెల్ పనులు ఈ ఏడాదే వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై తరుణ్ భాస్కర్ అధికారిక ప్రకటన చేసే వరకు క్లారిటీ రాదు. నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్ చుట్టూ తిరిగే కథను డైరెక్టర్ తరణ్ తక్కువ బడ్జెట్లో అద్భుతంగా తెరకెక్కించారు.