Cooli: రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ డేట్ లాక్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ(Cooli)’. ఫేమస్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి తన మాస్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాతో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్(posters), సాంగ్ ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శ్రుతిహాసన్‌(Shruti hasan) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌(Poster)ను విడుదల చేశారు.

వార్-2తో కూలీ ఢీ

కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్(Release) చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఓ సాలిడ్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. అందులో రజనీకాంత్‌ విజిల్‌ వేస్తూ కనిపించారు. బంగారం స్మగ్లింగ్‌ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.

Coolie Theatrical Rights: Rajinikanth-Lokesh Kanagaraj's Actioner Asks Over  Rs 40 Crore For Two Telugu States - Filmibeat

దీంతో ఈ ఏడాది ఆగస్టులో బాక్సాఫీస్(Box Office) దగ్గర బిగ్ వార్ జరగనుంది. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నట్లు ఇప్పటికే బాలీవుడ్ క్రేజీ స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్-2(War-2)’ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే రోజున రజినీకాంత్ ‘కూలీ’ వస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర వార్ జరగడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *