మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు దాదాపుగా పూర్తయింది. ఇందులో చిరు సరసన త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేసింది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో వింటేజ్ చిరును చూడబోతున్నారంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు.
12న ఫస్ట్ సాంగ్ రిలీజ్
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. విశ్వంభర (Vishwambhara) మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈనెల 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర నుంచి పాటను విడుదల చేయనున్నారట. కృష్ణ జిల్లా నందిగామలోని పరిటాల ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
చాలా రోజుల తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో విశ్వంభరపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వస్తుండటంతో పక్కా హిట్ అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక చిరు ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో మరో మూవీ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ఓ యాక్షన్ ఫిల్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.






