వారెవ్వా! ఇదీ కదా మ్యాచ్ అంటే.. లోస్కోరింగ్ గేమ్‌లో KKR చిత్తు

IPL 2025లో భాగంగా కోల్‌కతా వర్సెస్ పంజాబ్(KKR vs PBKS) మ్యాచ్ నరాలు తెగేంత ఉత్కంఠను రేపింది. బంతి బంతికి ఊహించిన మలుపులు తిరుగుతూ అభిమానులను ఉర్రూతలూగించింది. మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన లోస్కోరింగ్‌ గేమ్‌లో KKRపై పంజాబ్ కింగ్స్ 16 రన్స్‌తో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ సంచలన విజయంతో లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)ని వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. అటు KKR 7 మ్యాచుల్లో 3 గెలిచి 6 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

స్టార్ ప్లేయర్లంతా సింగిల్ డిజిట్‌కే..

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలోనే 111 పరుగులకే కుప్పకూలింది. ప్రియాన్ష్ 22, ప్రభ్‌సిమ్రన్ 30, వధేరా 10, శశాంక్ 18, జేవియర్ బార్ట్‌లెట్ 11 మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో అంతా గెలుపు రైడర్స్‌దే అని భావించారు. కానీ పంజాబ్ బౌలర్లు అద్భుతమే చేశారు. ముఖ్యంగా చాహల్ గింగిరాలు తిప్పే బంతులతో KKR బ్యాటర్లను వణికించాడు. దీంతో 112 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 15.1 ఓవర్లలోనే 95కే చతికిలబడింది.

ఈ రెండు ఘనతలు పంజాబ్‌ పేరిటే..

కేకేఆర్ జట్టులో రఘువంశీ 37 పరుగులు, రహానే 17 పరుగులు, రస్సెల్ 17 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీసి కేకేఆర్ వెన్ను విరిచాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. జాన్ సెన్ 3 వికెట్లు పడగొట్టాడు. బార్ట్ లెట్, అర్ష్ దీప్ సింగ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు. ఈ సంచలన విజయంతో ఐపీఎల్ చరిత్రలోనే పంజాబ్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో అతి తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ కింగ్స్ ఘనత సాధించింది. ఇదే పంజాబ్ 2024 సీజన్లో KKRపై 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ రెండు ఘనతలు పంజాబ్ పేరిటే.. ఇదే కోల్‌కతా టీమ్‌పైనే కావడం

విశేషం.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *