JEE ఫలితాల్లో అదరగొట్టిన ఖమ్మం విద్యార్థులు

జేఈఈ మెయిన్​ సెషన్​-2 ఫలితాలు (JEE Main 2025 Results) విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్​కు చెందిన బనిబ్రత మాజీ, వంగల అజయ్ ​రెడ్డి 300కి 300 మార్కులు పొంది జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు. మరోవైపుఈ ఫలితాల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా విద్యార్థులు కూడా సత్తా చాటారు. . ఈసారి జనరల్​ విభాగంలో కటాఫ్​ ర్యాంకుకు 93.102 పర్సంటైల్​గా నిర్ణయించారు.

జేఈఈలో సత్తా చాటిన ఖమ్మం

ఇక జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో ఖమ్మంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల (SR Junior College Khammam) విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాలేజీ ఛైర్మన్ వరదారెడ్డి అభినందించారు. కళాశాల స్థాపించినప్పటి నుంచి నేటి వరకు ప్రతి పోటీ పరీక్షలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ మంచిర్యాంకులు సాధించడం అభినందనీయం అని ఛైర్మన్ అన్నారు.

బి. వినోద్ (246 ర్యాంకు)

అందరికీ అభినందనలు

ఇంతటి ఘన విజయానికి కారణం పటిష్టమైన ప్రణాళిక, సీనియర్ అధ్యాపక బృందం, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల కృషి అని ఛైర్మన్ వారందరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి, డీజీఎం గోవర్ధన్ రెడ్డి, జోనల్ ఇంచార్జ్ విజయ భాస్కర్ రెడ్డి గారు, డీన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్స్ అశోక్, శ్రీనివాస్, సుధాకర్, బ్రహ్మం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.

ర్యాంకులు సాధించిన విద్యార్థులు వీరే

వినోద్-246, వెంకట్ చరణ్-1047, ఆకాష్ -1813, పవన్ కుమా ర్-1185,సాయి పవన్ 3248,అఖిల-3828, శివ సాయి-4721, సాయి చరణ్ -6200, భరత్ -6839,వాసు-6876, శ్రీలేఖ-7505, శశాంక్-8151, రవితేజ-8387, తీర్ధన-9434, నవీన్ కుమార్-9698,మోహిత్-9810, సంతోష్-9972,

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *