పొలంలో డొనాల్డ్ ట్రంప్.. బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘బలగం’ సాంగ్.. వీడియో చూశారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) అనగానే సీరియస్ లుక్స్.. ఎవరి మాట వినని సీతయ్య.. నేనే మోనార్క్ అనే వైఖరి గుర్తుకొస్తుంటుంది. ఎవడైతే నాకేంటి అనే తరహాలో ఆయన వైబ్ కనిపిస్తుంటుంది. ఇక ఆయన తీసుకునే నిర్ణయాలు.. విధానాలు కూడా ట్రంప్ చాలా టఫ్ గురూ అనిపించేలా ఉంటాయి. ఇక తాజాగా ఆయన ప్రపంచ దేశాలపై వేసిన సుంకాల (Trump Tariffs) గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది.

ట్రంప్ బలగం వీడియో

అయితే నిత్యం చాలా బిజీగా ఉండే ట్రంప్.. ఎప్పుడు చాలా సీరియస్ గా ఉండే అమెరికా ప్రెసిడెంట్.. సూటుబూటు ధరించి ఓ డెలిగేట్ లా కనిపించే అగ్రరాజ్యాధినేత (Trump Farmer Attair).. అవన్నీ వదిలేసి ఓ సాధారణ రైతులా.. అదికూడా సగటు భారతీయ కర్షకుడిలా పొలం బాట పడితే ఎలా ఉంటుంది. స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ.. గోమాత సేవలో తరిస్తూ.. కుటుంబంతో కలిసి దీపావళి చేసుకుంటే ఎలా ఉంటుంది.. ఆ ఊహే విభిన్నంగా ఉంది కదూ.

పొలంలో డొనాల్డ్ ట్రంప్

అయితే ట్రంప్ (Trump Farmer Video)  ఈ పనులన్నీ చేశారు. రైతులా పొలం బాట పట్టి.. గోమాతకు సేవ చేసి.. కుటుంబంతో దీపావళి పండుగ జరుపుకుని టపాసులు పేల్చారు ట్రంప్. ఇదేంటి అనుకుంటున్నారా.. అదంతా ఏఐ మాయ. ట్రంప్ రైతు వేషధారణలో ఉండి.. భారతీయుడిగా కనిపించిన ఏఐ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రైతు వేషధారణలో ట్రంప్

పల్లెటూరిలో వృద్ధ రైతుగా మారిన ట్రంప్ (Donald Trump AI Video).. సైకిల్ పై గడ్డిమోపు తీసుకెళ్తూ.. ఆవును తోలుకెళ్తూ.. చెట్టెక్కి పూలు కోస్తూ.. మనవడు మనవరాళ్లతో కలిసి టపాసులు కాలుస్తూ ఈ వీడియోలో కనిపించారు. ఇక ఈ ఏఐ వీడియో బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘బలగం’ సినిమా సాంగ్ వినిపించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ట్రంప్ తాత భలే క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏఐ మ్యాజికా మజాకా అంటూ మరికొందరు కామెంట్ల వర్షం కురిపిస్తుంటే.. ఇండియన్ రైతు గెటప్ ట్రంప్ నకు భలే బాగా సెట్ అయిందని ఇంకొందరు అంటున్నారు.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *