రీల్స్ చూస్తున్నారా..? మీ కోసమే ఇన్​స్టాలో అదిరిపోయే ఫీచర్

ప్రస్తుతం సాగుతోంది సోషల్ మీడియా యుగం. ఫేస్బుక్, వాట్సాప్ (Whatsapp), యూట్యూబ్ (You Tube), ఇన్​స్టాగ్రామ్, స్నాప్ చాట్ ఇలా ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ తో నేటి యువత చాలా బిజీబిజీగా గడుపుతోంది. ఇక యూట్యూబ్ షాట్స్, స్నాప్ చాట్ స్నాప్స్, ఇన్​స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) చేసేందుకు వారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇన్​స్టా రీల్స్ ట్రెండే నడుస్తోంది. ఏది పడితే అది.. ఎక్కడ పడితే అక్కడ.. సమయం.. సందర్భం.. ప్రాంతం.. ఏది చూడకుండా.. రీల్స్ చేసేస్తున్నారు. కొన్నిసార్లు ఆ ప్రయత్నంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్

అయినా రీల్స్ చేయడం మాత్రం ఆపడం లేదు. అందుకే మిగతా సోషల్ మీడియా యాప్స్ కంటే ఇన్​స్టాగ్రామ్ కు కాస్త క్రేజ్ ఎక్కువ. అందుకే యూజర్లను ఆకర్షించేందుకు ఈ సంస్థ తరచూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్ (Instagram Blend)’ అనే కొత్త ఫీచర్‌ను యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వ్యక్తిగతంగా చూస్తూ ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు మీకు ఇష్టమైన ఫ్రెండ్ లేదా గ్రూప్​తో కలిసి ఒకే రకమైన రీల్స్‌ను చూడొచ్చు. అదే ‘ఈ ఇన్​స్టాగ్రామ్ బ్లెండ్’ మ్యాజిక్ మరి.

ఈ ఫీచర్ ఏంటంటే?

ఈ ఫీచర్​.. మీరు మీ ఫ్రెండ్​ లేదా గ్రూప్​ చాట్​కు ప్రత్యేకంగా షేర్ చేసుకునే రీల్స్​ ఫీడ్​ను అందిస్తుంది. దీంతో యూజర్స్ తమ ఫ్రెండ్స్​తో ప్రైవేట్, కస్టమైజ్డ్ రీల్స్​ ఫీడ్​ను షేర్ చేసుకోవచ్చన్న మాట.  బ్లెండ్ ఫీచర్​ ఇన్​స్టాగ్రామ్ డైరెక్ట్ మెసెజ్​ల (DMs) మాదిరిగానే ప్రైవేట్.  మీకు నచ్చిన ఫ్రెండ్ లేదా గ్రూప్ తో కలిసి ఈ ఫీచర్ ను యూజ్ చేసుకోవచ్చు. అలా  మీరు చూస్తున్న రీల్స్, మీ ఫ్రెండ్‌లు చూస్తున్న రీల్స్ అన్నీ కలిసిపోయి ఒక ‘షేర్డ్ కస్టమ్ రీల్స్ ఫీడ్ (Shared Custom Reels Feed)’గా తయారవుతుంది.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *