తిరుమల భక్తులకు అలర్ట్.. ఈనెల 30న జూన్‌ నెల కోటా విడుదల

తిరుమల భక్తులకు అలర్ట్. త్వరలోనే శ్రీవారి స్వచ్ఛంద సేవ(Tirumala Srivari Seva Tickets)ల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.  సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సూచనల మేరకు టీటీడీ..  ఇప్పటికే శ్రీసత్యసాయి సేవాసంస్థ(పుట్టపర్తి), ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ (బెంగళూరు), ఇషా ఫౌండేషన్‌ (కోయంబత్తూర్‌) వంటి సంస్థలను సందర్శించి అధ్యయనం చేసింది. మార్పులకు అనుగుణంగా ఈ నెల 30వ తేదీన జూన్‌ నెల ఆన్‌లైన్‌ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.

మే 30న టికెట్లు విడుదల

తిరుమల (Tirumala Temple News), తిరుపతికి సంబంధించిన జనరల్‌ శ్రీవారి సేవా టికెట్లు  ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. మహిళలకు నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పురుషులకు పరకామణి సేవ  ఒంటి గంటకు, కొత్తగా ప్రారంభించిన గ్రూప్‌ లీడ్‌సేవకు సంబంధించిన టికెట్లు మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేయనున్నారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు (45-70 సంవత్సరాల వయసు ఉన్నవారు)  15 రోజులు, నెల లేదా మూడు నెలల వ్యవధితో సేవ చేయడానికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *