
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ అనంతరం, ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్(Pakistan) నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. ఈ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాల(Dead bodies of terrorists)కు పాకిస్థాన్ ప్రభుత్వం(Pakistan Govt) సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, ఈ కార్యక్రమాలకు లష్కరే తోయిబా(Lashkar-e-Taiba) అగ్ర కమాండర్ హాఫీజ్ అబ్దుల్ రౌఫ్(Hafiz Abdul Rauf), పలువురు సైనికాధికారులు హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Rare funeral which will make you feel happy…
This is the Funeral prayers for Terrorist Yaqub Mughal… He was k*lled in an airstrike by the Indian Armed Forces.. pic.twitter.com/ALVk3TbkG4
— Mr Sinha (@MrSinha_) May 7, 2025
ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని భారత్(India) సహా పలు దేశాలు ఆరోపిస్తున్నప్పటికీ, తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని పాకిస్థాన్ తరచూ పేర్కొంటోంది. అయితే, తాజాగా ‘ఆపరేషన్ సిందూర్’ లో మరణించినట్లు చెప్పబడుతున్న ముష్కరులకు పాకిస్థాన్ సైనిక లాంఛనాల(Pakistan military insignia)తో అంత్యక్రియలు నిర్వహించడంతో పాక్ వక్రబుద్ధి మరోసారి బహిర్గతమైంది. దీంతో ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌పై మండిపడుతున్నాయి.