Anupama Parameswaran: ఆ పేరు వాడొద్దు.. అనుపమ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ నిరాకరణ

కేంద్రమంత్రి, నటుడు సురేశ్‌ గోపీ, నటి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ (Janaki vs State of Kerala). సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీలో జానకి అనే పాత్రలో అనుపమ కనిపించనున్నారు. అయితే ఈ మూవీ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. దీనికి సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. సీతాదేవికి మరో పేరైన జానకి పేరును అలాంటి పాత్రకు పెట్టకోలేమని పేర్కొంటూ ఈ చిత్రం స్క్రీనింగ్‌కు అనుమతి నిరాకరించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రదర్శనకు సెన్సార్‌ బోర్డు అనుమతి నిరాకరించిందని దర్శకుడు సైతం వెల్లడించారు.

ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘సినిమాలో జానకి అనే పేరును ఉపయోగించొద్దని ఈ చిత్ర నిర్మాతలకు సెన్సార్‌ బోర్డు స్పష్టంగా తెలియజేసినట్లు చెప్పారు. టైటిల్‌, పాత్ర పేరును మార్చాలని బోర్డు చిత్రబృందానికి సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరును పెట్టలేమని బోర్డు చెప్పింది. ఇటీవల మరో మలయాళ చిత్ర నిర్మాత తన సినిమాలో జానకి అనే పాత్ర పేరు విషయంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. దీంతో సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందడానికి ఆ పేరును ‘జయంతి’గా మార్చారు’ అని తెలిపారు. జూన్ 27 రిలీజ్ చేసేందుకు సిద్ధమైన చిత్రబృందం ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *