Mahesh Babu: అద్భుతం.. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. కొత్త సినిమాపై మహేశ్ ప్రశంసలు

భిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆమిర్ ఖాన్ (Aamir khan) మరోసారి సత్తా చాటారు. మానసిన దివ్యాంగులతో నటించి మెప్పించారు. ఆయన ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న మూవీ ‘సితారే జమీన్‌ పర్‌’. ఈనెల 20న రిలీజైన ఈ సినిమా హృదయాలను హత్తుకుంటోంది. ఈ మూవీకి సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu) సైతం ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘‘అద్భుతమైన సినిమా. ఆమిర్‌ ఖాన్‌ ఇతర క్లాసిక్‌ సినిమాల్లాగానే సితారే జమీన్‌ పర్‌ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ‘సితారే జమీన్‌ పర్‌’ చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు’’ అని ఆనందం వ్యక్తం చేశారు.

2007లో వచ్చిన ‘తారే జమీన్‌ పర్‌’కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే (Sitaare zameen par). మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న కొందరికి బాస్కెట్‌ బాల్‌ క్రీడలో శిక్షణ ఇచ్చి, వారిని మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే నేపథ్యంలో రూపొందింది. వారికి కోచ్గా ఆమిర్‌ఖాన్‌ నటించి మెప్పించారు. ఈ సినిమానుకు విశేష ఆదరణ లభిస్తోంది. పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ (Sachin Tendulkar), బాలీవుడ్‌ కింగ్ షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ప్రశంసించారు. ఈ సినిమా సమాజంలో మార్పు తీసుకురాగలదని అభిప్రాయం వ్యక్తంచేశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *