కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపీ, నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala). సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీలో జానకి అనే పాత్రలో అనుపమ కనిపించనున్నారు. అయితే ఈ మూవీ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. దీనికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. సీతాదేవికి మరో పేరైన జానకి పేరును అలాంటి పాత్రకు పెట్టకోలేమని పేర్కొంటూ ఈ చిత్రం స్క్రీనింగ్‌కు అనుమతి నిరాకరించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించిందని దర్శకుడు సైతం వెల్లడించారు.
Central Board of Film Certification has demanded a name change for the film ‘JSK – Janaki Vs State of Kerala’, starring Union Minister #SureshGopi #JSK #JanakiVsStateOfKerala https://t.co/Ubn6tsPPBZ
— The Hindu – Kerala (@THKerala) June 23, 2025
ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘సినిమాలో జానకి అనే పేరును ఉపయోగించొద్దని ఈ చిత్ర నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్పష్టంగా తెలియజేసినట్లు చెప్పారు. టైటిల్, పాత్ర పేరును మార్చాలని బోర్డు చిత్రబృందానికి సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరును పెట్టలేమని బోర్డు చెప్పింది. ఇటీవల మరో మలయాళ చిత్ర నిర్మాత తన సినిమాలో జానకి అనే పాత్ర పేరు విషయంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ పొందడానికి ఆ పేరును ‘జయంతి’గా మార్చారు’ అని తెలిపారు. జూన్ 27 రిలీజ్ చేసేందుకు సిద్ధమైన చిత్రబృందం ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.






