బాలీవుడ్(Bollywood) బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె, మొదటి సినిమా ‘దఢక్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్(Tollywood)లోను చాలా తక్కువ టైమ్‌లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
ఓ వైపు హిందీ సినిమాలు, మరోవైపు తెలుగు సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఎన్టీఆర్(Jr.NTR) ‘దేవర’(Devara) మూవీ ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, తన అందం, నటనతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) సరసన ‘పెద్ది’( ‘Peddi’) సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
ఇక సినిమాలు మాత్రమే కాదు, ఫ్యాషన్ షోలు అంటే కూడా జాన్వీకి విపరీతమైన ఇష్టమట. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె, స్పెషల్ ఔట్ఫిట్లో మెరిసిపోయింది. ఈ డిజైనర్ డ్రెస్‌లో ఆమె తల్లి శ్రీదేవిని తలపించిందంటూ ఇంకొందరు దేవకన్యలా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్లతో వెల్లువెత్తుతున్నాయి. జాన్వీ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram






