ఇక టీడీపీ నాది – నంద‌మూరి బాల‌కృష్ణ‌

అర‌ణ్య‌

  1. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుతో ఎంతోమంది కార్య‌క‌ర్త‌లు ప్రాణాలు విడిచార‌ని… ఆ కుటుంబాలను తాను నేరుగా క‌లిసి పరామర్శిస్తానని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదన్నారు. అంద‌రికీ తాను అండ‌గా నిల‌బ‌డ‌తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. నేడు మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇక టీడీపీ బాధ్య‌త‌లు ఎత్తుకుని సైకోకి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాను. స్వాతంత్ర్య సమరం మనం చూడలేదు. కానీ ఇప్పుడు ఆ స్ఫూర్తితో పోరాడాల్సి ఉంటుంది. జనం ఆలోచించాలి. ఇలాగే భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుంది. సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలోచించడం కాదు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. జగనుకు మనుషులేంటేనే అలర్జీ.

 

 

 

* ఎంగిలి మెతుకుల జ‌గ‌న్‌!
ముచ్చి మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు- విదిల్చే స్వభావం జగన్‌ది. రూ.10 ఇచ్చి.. రూ. 100 గుంజుకునే స్వభావం వైసీపీది. హిందూపురంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే మిగిలింది.. ఇప్పుడు అభివృద్ధే లేదు. మాట తప్పని పార్టీ మాది. మాట తప్పకపోవడం అనేది ఎన్టీఆర్ నుంచి మా పార్టీకి వారసత్వంగా వచ్చింది. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసింది.. ఇప్పుడూ అధిగమిస్తాం. ఇప్పుడే కాదు.. ఇంకా కేసులు పెడతారు. జగన్ లండన్ ఎందుకెళ్లారు? ఇవాళే జగన్ ఏపీకి వచ్చాడంట.. ఈ హ్యాంగోవర్ దిగడానికి మరో పది రోజులు పడుతుందేమోన‌ని ఎద్దేవా చేశారు.

ప్రజాపక్షాన పోరాడతాం. మన శక్తి యువత.. వారిని స్ట్రీమ్ లైన్ చేయాలి. కానీ జగన్ ప్రభుత్వం గంజాయికి బానిసలుగా మార్చేస్తున్నారు. హిందూపురంలో ప్రభుత్వాస్పత్రిలో పందులు.. పశువులు తిరుగుతున్నాయి. జగన్ ఏపీని ప్రపంచ పటంలో లేకుండా చేశారు. అభూత కల్పనలు సృష్టించి చంద్రబాబుపై కేసు పెట్టారు. అభివృద్ధికి సంక్షేమానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఓటమి తథ్యమనే భయంతో జగన్ ఈ కేసులు పెట్టించినట్టు కన్పిస్తోంది. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కదా అని చంద్రబాబును 16 రోజులైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ కేసును సృష్టించారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు సంబంధించి సీమెన్స్ సంస్థతో తొలి ఒప్పందం 2013లో ఒప్పందం కుదుర్చుకుందని, అలాగే ట్రైనింగ్ నిమిత్తం డిజైన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ సాఫ్ట్ వేర్ సరఫరా చేస్తే.. డిజైన్ టెక్ శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వ వాటా 10 శాతం. హిందూపురంలో మేమూ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో మేళా నిర్వహించాం. రాష్ట్రం మొత్తం మీద 2.13 లక్షల మంది ఆ రోజున తెలుగువారి ఆత్మాభిమానం కోసం ఎన్టీఆర్ పార్టీని పెట్టారు.చంద్రబాబు హయాంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి జరిగింది. ఒక్క ఓటంటూ అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేశారు. దేశవ్యాప్తంగా పార్టీలను ఏకం చేసిన ఘనత ఎన్టీఆర్‌ది. పార్టీలను ఏకం చేయడం అంటే దేశాన్నే ఐక్యం చేయడమే’’ అని అన్నారు.

  • Related Posts

    Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

    రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

    గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

    అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *