వామ్మో.. సంక్రాంతి పందెం కోళ్లకు ఇన్ని రాజభోగాలా.?

మన ఈనాడు:

ప్రస్తుతం సంక్రాంతి అంటే కోడి పందాలు అనే విధంగా ట్రెండ్ మారిపోయింది. సంక్రాంతి పండుగకు జరిగే కోడిపందాలు చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం వస్తున్నారంటే కోడి పందెలాకు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగ మూడు రోజులు.. కోడిపందాల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. మరో రెండు నెలలలో సంక్రాంతి రానుంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు…
తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ప్రతి ఏటా సంక్రాంతికి చిన్న, పెద్ద, ఊరు వాడ అంతా ఏకమై పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. నగరాల్లో ప్రజలు ముందుగానే సంక్రాంతికి తమ సొంత ఊర్లకు వెళ్లి పండుగ మూడు రోజులు రోజులు ఆనందంగా ఉండేందుకు ఎంతో ప్లాన్ చేసుకుంటారు. సాధారణంగా సంక్రాంతి అంటే భోగి మంటలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్లు కామన్‌గా ఉండే అంశాలు.
ప్రస్తుతం సంక్రాంతి అంటే కోడి పందాలు అనే విధంగా ట్రెండ్ మారిపోయింది. సంక్రాంతి పండుగకు జరిగే కోడిపందాలు చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం వస్తున్నారంటే కోడి పందెలాకు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగ మూడు రోజులు.. కోడిపందాల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. మరో రెండు నెలలలో సంక్రాంతి రానుంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు పోటీలో దింపేందుకు ఇప్పటినుంచే పందెం కోళ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కోడి పందాలు లేకుండా సంక్రాంతి జరగదు అనే ట్రెండ్ జనాల్లో బాగా నాటుకుపోయింది. వచ్చే సంక్రాంతికి ఇప్పటికే పందెం పుంజులు సిద్ధం చేస్తూ వాటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు పందెం రాయుళ్లు. ఒక్కో కోడిపుంజు తయారీకి సుమారు రూ. 25 వేల వరకు ఖర్చవుతుంది. అలా తయారైన కోడిపుంజులను రంగు, పోరాట పటిమను బట్టి రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తుంటారు.

పందెం పుంజుల పెంపకం, పోషణ..
పందెం పుంజుల పెంపకం ఎంతో శ్రమతో కూడుకున్న పని. ముందుగా విశాలమైన ఖాళీ ప్రదేశంలో వాటి పెంపకానికి అనువైన షెడ్లు నిర్మిస్తారు. ఆ తరువాత శ్రేష్టమైన జాతులకు చెందిన కోడి పెట్టల నుంచి గుడ్లు సేకరించి వాటిని పిల్లలుగా పొదిగిస్తారు. పిల్ల దశ నుంచి ఒక్కొ పుంజుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ సుమారు ఆరు నెలల వరకు వాటిని గుంపులోనే ఉంచుతారు. ఆ తర్వాత పుంజు తయారీ ప్రారంభంలో వాటి ఎత్తు, బలం, రంగు, పోరాట పటిమ ఆధారంగా వాటిని గుంపులో నుంచి వేరుచేసి ఒక్కొక్క దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకునే వరకు కంటికి రెప్పలా కాపాడుతారు. అవి అనారోగ్యం బారిన పడకుండా ఎప్పటికప్పుడు పరీక్షించి నాణ్యమైన మందులు ఇస్తారు. మేత కూడా నిర్ణీత మైన సమయంలో ప్రతిరోజు ఒకే సమయానికి నిర్దిష్ట ప్రమాణంలో వాటికి కావాల్సిన పోషక విలువలు ఉండే ఆహారాన్ని మాత్రమే ఇస్తుంటారు.
ముఖ్యంగా సంక్రాంతి రెండు నెలలు ముందు నుంచి ప్రత్యేక శిక్షణ, మేత ఇస్తారు. అందులో భాగంగానే ఉదయం ఉడికించిన కోడిగుడ్డుపై తెల్లటి పదార్థాన్ని తినిపిస్తారు. ఆ తరువాత వాటికి బరిలో పోటీ సమయంలో అలసట లేకుండా ఉండేందుకు ఉదయాన్నే వాకింగ్, రన్నింగ్ చేయిస్తారు. చల్లటి నీటిలో శరీరం దృఢపడేలా స్విమ్మింగ్ చేయిస్తారు. ఆ తర్వాత పోషకాలు ఎక్కువగా ఉండే బాదం, పిస్తా, జీడిపప్పును మేతగా వేస్తారు. పోరాట సమయంలో గాయాలు తట్టుకునీ నిలబడే విధంగా శరీరం దృఢంగా వుండేలా వేడి నీటి ఆవిరిసెగతో కాకలు తీయిస్తారు. ఆ తరువాత యాట మాంసాన్ని గుండ్రని ఉండలుగా చేసి వాటికి తినిపిస్తారు. ఓ రకంగా చెప్పాలంటే సంక్రాంతికి ముందు రెండు నెలలు కూడా పందెం పుంజులు రాజభోగాలు అనుభవిస్తాయి.
ఆ నక్షత్ర ప్రభావం భట్టి కూడా కోడిపందాలు వేస్తుంటారు. అదేవిధంగా కుక్కుట శాస్త్రంలో దిక్కులను సైతం లెక్కలోకి తీసుకుంటారు. నక్షత్రం ఆధారంగా ఏ రంగు కోడిని ఏ దిక్కు వైపు నుంచి వదిలితే పందెం గెలుస్తుందో కుక్కుట శాస్త్రంలో పేర్కొన్నారు. దీనిని ఆధారం చేసుకొని చాలామంది పందెం రాయుళ్లు కోడిపందాలు వేస్తుంటారు. ఈ రకంగా పందాలను పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలో నిర్వహిస్తారు. కోడి పందేల ముందు వరకు పోలీసులు అడపాదడపా బైండోవర్ కేసులు నమోదు చేసి పండగ మూడు రోజులు మాత్రం అటువైపు తలెత్తి కూడా చూడరు. ఎందుకంటే సంక్రాంతి పండగ సమయంలో పందాల విషయంలో పందెం రాయుళ్లు పార్టీలు, కులాలు ఇవేమీ పట్టించుకోరు. అందరు కలిసికట్టుగా ఉంటూ కోడి పందేల పైనే వారి దృష్టి మొత్తం కేంద్రీకరించి ఉంటారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *