మన ఈనాడు: నగరంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. దీంతో సాయంత్రం సాధారణం కంటే 5-6 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. గురువారం అత్యల్పంగా హయత్నగర్(Hayatnagar)లో 18 డిగ్రీలు, రాజేంద్రనగర్ 18.5, పటాన్చెరు 19.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల వరకు ప్రధానరహదారులను మంచు కప్పేస్తుండడంతో రోడ్లపైకి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలిగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చలితో వణికిపోతున్నారు. కోర్ సిటీతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD
తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్గఢ్ పరిసర…








