మన ఈనాడు: నగరంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. దీంతో సాయంత్రం సాధారణం కంటే 5-6 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. గురువారం అత్యల్పంగా హయత్‌నగర్(Hayatnagar)లో 18 డిగ్రీలు, రాజేంద్రనగర్ 18.5, పటాన్‌చెరు 19.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల వరకు ప్రధానరహదారులను మంచు కప్పేస్తుండడంతో రోడ్లపైకి వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలిగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చలితో వణికిపోతున్నారు. కోర్ సిటీతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
Rain Alert: పండుగ వేళ వాతావరణశాఖ కీలక అప్డేట్!
పట్టణాలు ఖాళీ అయ్యాయి. నగరాలు వెలవెలబోయాయి. ఇన్నిరోజులు వర్క్ లైఫ్(Work Life)తో బిజీబిజీగా గడిపిన వారంతా పల్లెబాట పట్టారు. దీంతో ఎక్కడ చూసినా సంక్రాంతి(Sankranti) సందడే నెలకొంది. మూడు రోజుల పండగను చిరకాలం గుర్తిండిపోయేలా నిర్వహించుకుంటున్నారు. కోడిపందేలు, ఎద్దుల పోటీలు, గాలిపటాలు…