మన ఈనాడు:ఇవాళ ఉదయం 11 గంటలకు సెక్రెటరియేట్లో ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. మిచాంగ్ తుఫాను వల్ల వాటిళ్లిన నష్టం, ప్రభుత్వం నుండి చేసిన సాయం, పంట నష్టం పై మంత్రివర్గం చర్చించనుంది. మిచాంగ్ తుఫాన్ బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, మౌలిక వసతుల కల్పనపై క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోనున్నారు. అదేవిధంగా ప్రతినెల ఇచ్చే సామాజిక పింఛను 2750 రూపాయలు నుండి 3000 రూపాయలకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పించను రూ. 3000 ఇస్తామన్న జగన్ హామీ జనవరి 1వ తేది నుండి అమలుకు క్యాబినెట్ ఓకే చెప్పనుంది. ఎమ్యెల్యే, ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, మంత్రులకుసైతం స్థాన చలనం, మరికొందరు మంత్రులకు, ఎమ్యెల్యేలకు స్థాన చలనంచేసే అంశంపై మంత్రులతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…







