మన ఈనాడు:తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచ్ఛన్నసమరం ముగిసింది. లోక్ సభ ఎన్నికలకు తెలంగాణా సిద్ధమైంది . అయితే ఈసారి లోక్ సభ ఎనికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ఏ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుంది? అన్నది ప్రతీ ఒక్కరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్ సభ ఎన్నికల మీద ఉంటుంది అని భావించినప్పటికీ ఏ మేరకు ఉంటుంది అన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కటంలేదు.
అయితే తాజాగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తెలంగాణా లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఎవరికి వస్తాయో తేల్చింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్ తో ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 8 నుండి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాలలో కాంగ్రెస్ జోష్ లో ఉంది.
తెలంగాణలో బీఆర్ఎస్, మరియు బీజేపీ మూడు నుండి 5 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు తేల్చింది. ఇక ఎంఐఎంకు ఒక సీటు గ్యారెంటీ అని చెప్పింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి, ఆయా పార్టీల ఓటింగ్ శాతాలు, ప్రజాభిప్రాయం మేరకు ఈ సర్వే నిర్వహించిన టైమ్స్ నౌ ఈటీజీ తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని తేల్చింది.