CM Revanth: 28నుంచే రేషన్​ కార్డులు దరఖాస్తులు..నిబంధనలు ఇవే…

మన ఈనాడు:కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రభుత్వం పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. పదేండ్ల తరువాత కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నిబంధనలు ఇలా ఉన్నాయి .. గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించబోతున్నారు.

*గతంలో రేషన్‌ కార్డు ఉండి ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడితే అనర్హులే.
*గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్నవారే అర్హులు.
*మాగాణి 3.5 ఎకరాలు, బీడు భూములైతే 7.5 ఎకరాలు.
*గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం.
-*100 చ.మీ ఇల్లు, ఫ్లాట్‌, కారు, ట్రాక్టర్‌, ఏడాదికి రూ.1.5 లక్షల కంటే.
*ఆదాయం ఎక్కువ ఉంటే రేషన్‌ కార్డు సరెండర్ చేయాల్సిందే.!
*ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌, ఇన్‌కంట్యాక్స్‌, సేల్స్‌ ట్యాక్స్‌ చెల్లించినా అనర్హులే.
*డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేషన్‌ కార్డుకు అనర్హులే.
తెలంగాణలో 2014 నుంచి రేషన్‌ కార్డుల జారీ నిలిచిపోయింది. సంక్షేమ పథకాల అమలులో రేషన్‌ కార్డే కీలకం కావడంతో కొత్త ప్రభుత్వం రావడంతో జనాల్లో ఆశలు పెరిగాయి. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు రూ. 2500, విద్యార్థులకు రూ.5లక్షల భరోసా పథకానికి, రూ.10లక్షల ఆరోగ్యబీమాకు రేషన్‌ కార్డు కంపల్సరీ. అయితే వారి ఆశలకు ఎలాంటి భంగం కలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటిలో రెండిటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *