ధరణిపై రేవంత్​ సీరియస్​..త్వరలోనే భూములన్నీ ఆపోర్టల్​లోకే

మన ఈనాడు:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ విషయంలో సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని చెప్పింది. అంతేగాకుండా భూమాత పోర్టల్ తీసుకొచ్చి ప్రజలు కష్టాలు తొలగిస్తామని ప్రచారం చేసింది.

ఈక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy) ఆ దిశగా అడుగులు వేస్తోంది. ధరణి పోర్టల్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి అధ్యయనానికి ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీటర్, భూ నిపుణులు, అడ్వకేట్ భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌లను నియమించింది. ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణంపై ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ధరణి కమిటీ కన్వీనర్‌గా సీసీఎల్‌ఏ వ్యవహరించనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *