మన ఈనాడు:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ విషయంలో సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని చెప్పింది. అంతేగాకుండా భూమాత పోర్టల్ తీసుకొచ్చి ప్రజలు కష్టాలు తొలగిస్తామని ప్రచారం చేసింది.
ఈక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy) ఆ దిశగా అడుగులు వేస్తోంది. ధరణి పోర్టల్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి అధ్యయనానికి ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీటర్, భూ నిపుణులు, అడ్వకేట్ భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌లను నియమించింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ధరణి కమిటీ కన్వీనర్‌గా సీసీఎల్‌ఏ వ్యవహరించనుంది.