Medaram: మేడారం జాతర వచ్చేసింది.. 6వేల ప్రత్యేక బస్సులు

మన ఈనాడు:ఉచిత బస్సు పథకం వల్ల మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 6 వేలకు పైగానే ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ సిద్దం అవుతోంది.

జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులకు మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 28 లోపు అన్ని పనులు కంప్లీట్​ చేయబోతున్నారు. గతంలో అక్కడ పని చేసిన అధికారులకు ట్రాఫిక్ జామ్ ,రూట్ క్లియారెన్స్ కోసం నోడల్ ఆఫీసర్లకే మరోసారి బాధ్యతలు అప్పగించారు.

మేడారం జాతర కోట్లాది మంది భక్తులు రాబోతుండటంతో ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది.సమ్మక్క సారక్క జాతర విజయవంతం చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు.

మేడారం సమ్మక్క సారక్క జాతర కోటి 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు. మహాలక్ష్మి పథకం ద్వారా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం నెలకొంది. ఈసారి 6 వేల బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ప్రణాళికలు చేసింది..

అదనంగా బస్సులు వేయడం వల్ల 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆలోచన చేశారు. అందుకోసం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు పరిశీలన చేస్తుంది. బస్సులు మరిన్ని అవసరమైనప్పుడు ప్రైవేట్ బస్సులు , స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ఆర్టీసీ, రవాణా అధికారులు సమన్వయం చేస్తున్నారు.

Share post:

లేటెస్ట్