మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్(BRS) ప్లాన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM reventhReddy) సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి(Patnam sunitha Reddy)గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు భారతీయ జనతాపార్టీ ఈటల రాజేందర్(etela rajender) బరిలో నిలబెట్టడంతోపాటు ప్రధాని నరేంద్రమోదీనే ప్రచారం చేసి వెళ్లారు.
బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi laxmareddy) బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు దిమ్మతిరిగే కౌంటర్లతో ప్రచారంలో ముందుకెళ్తున్నారు. లోకల్–నాన్‌లోకల్ మధ్య మల్కాజ్‌గిరిలో ఎన్నికల పోరు ఉండబోతుందని బీఆర్ఎస్ అభ్యర్థిగా ధీమాగా జనంలోకి వెళ్తున్నారు. బీజేపీకి ఓటు వేస్తే హుజారాబాద్ 166కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందని , కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చేవళ్ల 59కిలోమీటర్లు పోవాల్సి ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. అదే బీఆర్ఎస్ కు ఓటు వేస్తే లోకల్‌గా అందుబాటులో ఉంటానని మైలురాయిపై వేసిన పోస్టర్లు ప్రజలను ఆలోచనలో పడేశాయి.
రాగిడి లక్ష్మారెడ్డి తన గెలుపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బుతో అడ్డుకోలేవని, ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ధీమాగా ఉన్నారు. మల్కాజ్గిరి ఓటు..వలస నేతలకు కాదు…ఈ సారి లోకల్ అంటూ జనం సిద్దమయ్యారని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు దుకాణం సర్దుకోవాని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.









