రుణమాఫీపై CM రేవంత్ రెడ్డి ప్రకటనపై.. హరీష్ రావు సంచలన ట్వీట్

పంట రుణాల మాఫీపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ నారాయణ పేట జిల్లాలో నిర్వహించిన జన జాతర సభలో ప్రకటన చేశారు.

ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు(Ex Minister Harish Rao) స్పందించారు. ‘పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Reventh Reddy)ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలి.

రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారు. ఎకరానికి 15000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు ? వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదు? మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు 2500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమయింది ? 4 వేలకు పెంచుతామన్న పెన్షన్ను ఎప్పుడు పెంచి ఇస్తారు? ఇచ్చిన హామీలను అమలు చేసే సిద్ధ శుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓడిపోతామని భయంతోనే మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నారు. తెలంగాణ(Telangana) ప్రజలు మీపై నమ్మకం కోల్పోయారు.’ అని ట్వీట్ చేశారు.

Share post:

లేటెస్ట్