AP CM: ఇకపై 1995 నాటి చంద్రబాబుని చూస్తారు..

Mana Enadu:ఆంధ్రప్రదేశ్‌లో(Andhra pradesh) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(pawan kalyan)తో, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ కలిసి తొలిసారిగా ఏర్పాటు చేసిన కలెక్టర్ల(collectors) సదస్సులో సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఒక వైపు నేను మారిపోయాను అంటూనే.. మరో వైపు 1995 నాటి బాబుని చూస్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై గంటల తరబడి ఇక మీదట తన ప్రసంగాలు ఉండవని బాబు చెప్పారు. తాను ఏది చేప్పినా సూటిగా స్పష్టంగా చెబుతానని తేల్చి చెప్పారు. నాలుగోసారి సీఎం అయ్యాక అత్యధికంగా మీటింగ్‌ని అడ్రస్ చేసిన సమయం గంటన్నర అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

 

 సబ్జెక్ట్‌తో రాకపోతే మరోసారి

అంతే కాదు మీటింగ్ అర్ధవంతంగా జరగాలని ఆయన కోరారు. సబ్జెక్ట్‌తో ఎవరైనా రాకపోయినా మళ్లీ మీటింగ్ పెట్టుకుందామని చెప్పారు. తప్ప టైం వేస్ట్ చేయడం లేదని ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉంటే తాను సమర్థతలో గుడ్ అడ్మినిస్ట్రేషన్‌లో మళ్లీ 1995 నాటి పీరియడ్‌కి వెళ్తాను అని బాబు స్పష్టం చేశారు. ఆనాడు తాను ఎంతో డైనమిక్‌గా ఉండేవాడిని అని చెప్పారు. అప్పట్లో తరచూ ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా పాలనలో వేగం పెంచామని అన్నారు. ఇపుడు కూడా మళ్లీ అలాంటి సడెన్ సర్ప్రైజ్ విజిటింగ్స్ ఉంటాయని బాబు హింట్ ఇచ్చారు.

 బాధ్యతగా పనిచేయాలి..

అదే సమయంలో కలెక్టర్లు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. బాగా పనిచేసిన కలెక్టర్లను మూడేళ్లు కాదు ఆరేళ్లు అయినా పనిచేసే చోట కొనసాగిస్తామని చెప్పారు. కలెక్టర్లు జాబ్(job) ఓరియెంటెడ్‌గా కాకుండా వినూత్న ఆలోచనలు చేయాలని అప్డేట్ అవుతూ ఉండాలని ఆయన సూచించారు. ప్రజా కోణంలో పాలన జిల్లా స్థాయిలో కొనసాగించాలని ఆయన చెప్పారు. ఇక తాను గతంలో సీఎంగా ఉన్నపుడు అభివృద్ధి విషయంలో కొన్ని కీలక సంస్కరణలు తీసుకున్నాను అని చెప్పారు.

 ఇకపై పీ4 మోడల్

ఇపుడు P4 మోడల్ని (P4 model) తీసుకున్నామని చంద్రబాబు ప్రకటించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్ నర్ షిప్ (పీ4) మోడల్‌తో ముందుకు వెళ్దామని ఆయన అన్నారు. దీని ద్వారా బాగా డబ్బున్న పది మంది దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ఇరవై కుటుంబాలను ముందుకు తీసుకుని రావాల్సి ఉంటుందని అన్నారు. ప్రతీ ఊరి నుంచి గొప్ప వారు ఎంతో మంది బయటకు వస్తున్నారని అదే సమయంలో ఆ ఊరిలో వారి సాటి మనుషులు ఇంకా పేదలుగా ఉండిపోతున్నారని బాబు గుర్తు చేశారు. కలెక్టర్లు కూడా ఇలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన కోరారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *