Mana Enadu:సాధారణంగా చిన్న పిల్లలు డిస్నీ ప్రిన్స్, ప్రిన్సెస్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందులోనూ లయన్ కింగ్ చిత్రాలంటే ఇక టీవీ ముందు నుంచి అస్సలు కదలరు. ది లయన్ కింగ్ మూవీ ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్‌గా ముఫాసా – ది లయన్ కింగ్ పేరుతో ఓ చిత్రం వస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్, టిఫానీ బూనే, కగిసో లేడిగా, ప్రెస్టన్ నైమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ప్రీక్వెల్‌ను బేరీ జెంకిన్స్ తెరకెక్కిస్తున్నారు. అనాథగా మారిన ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడన్న కథతో ఈ చిత్రం వస్తోంది. ఇందులో ముఫాసా, టాకాల మధ్య అన్నదమ్ముల సంబంధాన్ని బాగా ఎలివేట్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ఏడాదిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ముఫాసా: ది లయన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ది లయన్ కింగ్‌లో ఏం జరిగింది.?
ది లయన్ కింగ్ మూవీలో ముఫాసాను తన తమ్ముడు స్కార్ అంతమొందిస్తాడు. తమ్ముడి కుట్రకు అడవికి రాజైన ముఫాసా మరణిస్తాడు. ఇక ముఫాసా తనయుడు అయిన సింబా.. ఈ విషయం తెలుసుకుని తన బాబాయ్ స్కార్ను రాజ్యం నుంచి తరిమేసి ముఫాసా వారసుడిగా.. సింబా మళ్లీ అడవికి రాజు అవుతాడు. అలా ఆ చిత్రానికి శుభం కార్డు పడిపోతుంది.






