అతడు’ నా ఫేవరెట్.. హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ నాకు గుర్తే : విజయ్ సేతుపతి

Mana Enadu:సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్​రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఒకరు. ఆయన ఓ సినిమా సైన్ చేశారంటే.. అందులో తన పాత్ర హీరో, విలన్, సైడ్ యాక్టర్ ఇలా ఏం చూడరు.. ఆ కథకు తన పాత్ర బలం చేకూరుస్తుందా అన్నది మాత్రమే చూస్తారు. అందుకే ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ. విజయ్ సేతుపతి సినిమా వస్తుందంటే తప్పకుండా చూసి తీరాల్సిందేనని ప్రేక్షకులు భావిస్తుంటారు. అలాంటి విజయ్​ ఓ సినిమాను పదే పదే చూస్తారట. ముఖ్యంగా తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న సమయంలో ఆ చిత్రాన్ని చాలా సార్లు చూశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?

తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్‌ బాబు నటించిన ‘అతడు’ సినిమాను రిపీట్‌ మోడ్‌లో చూసినట్లు విజయ్ సేతుపతి చెప్పారు. అందులో మహేశ్ బాబు ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ తనకు గుర్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అన్ని సీన్లు తనకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయని చెప్పారు. ఇక ఆ సినిమాలో ఎమోషన్ తనకు బాగా నచ్చిందని.. త్రివిక్రమ్ ఎమోషనల్ సీన్స్​ను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఆ చిత్రంలో పార్థు – పూరీ (మహేశ్‌ – త్రిష)ల మధ్య రొమాన్స్‌ కూడా నచ్చిందని చెప్పుకొచ్చారు. బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు, పాటలు అన్నీ తనకు ఇష్టమని వెల్లడించారు.

ఇక విజయ్ సేతుపతి వంటి వర్సటైల్ హీరో తమ అభిమాన నటుడు మహేశ్ బాబును, ఆయన చిత్రాన్ని పొగడటంతో సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ తెగ సంబురపడి పోతున్నారు. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా నటించిన ‘అతడు’ 2005లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో కంటే టీవీలో ఎక్కువగా ఆదరణ పొందింది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *