Monkey Pox: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?.. మంకీపాక్స్ కావొచ్చు!.. అలర్ట్ అవ్వండి

ManaEnadu:కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికిస్తోంది. దానిపేరే మంకీపాక్స్ (ఎంపాక్స్)​. ఆఫ్రికా దేశంలో పుట్టి ఆ దేశాల్లో వ్యాపిస్తూ  ప్రపంచ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇక తాజాగా మన పొరుగుదేశమైన పాకిస్థాన్ కూ చేరింది. ఈ నేపథ్యంలో భారతదేశం అప్రమత్తమైంది. అయితే అసలు మంకీపాక్స్ అంటే ఏంటి? దీని లక్షణాలేంటి? ఎలా వ్యాపిస్తుంది? తెలుసుకుందాం రండి.

మంకీపాక్స్ ను క్లాడ్‌-1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌), క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌) అనే రెండు వేరియంట్లుగా డివైడ్ చేశారు.  క్లాడ్‌-1 సోకితే న్యూమోనియా, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు.. క్లాడ్‌-2 వ్యాపిస్తే..  శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్లాడ్-1 ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

మంకీపాక్స్‌ నేరుగా తాకడం వల్ల, నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల వ్యాపిస్తుంది.  రోగులు వాడిన దుస్తులు వాడటం వల్ల సోకుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న క్లాడ్‌-1 ఐబీ వేరియంట్‌ లైంగిక సంబంధాల కారణంగా  వ్యాపిస్తున్నట్లు సమాచారం.

మంకీపాక్స్ లక్షణాలు ఇవే..!:

ఈ వైరస్‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.

పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ

కొంతమందికి నోరు, కళ్లు, గొంతు, ప్రైవేట్ భాగాలపై పొక్కులు రావడం.

Related Posts

Sonia Gandhi: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ఏమైందంటే!

కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ…

Corona Virus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్త వేరియంట్లతో దడ 

దేశంలో మళ్లీ కరోనా (Corona) కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఢిల్లీలో ఏకంగా ఒకే రోజు 23 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొత్త రకం కరోనా వేరియంట్లను గుర్తించినట్లు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *